AP EAPCET 2026 స్పోర్ట్స్ కోటా టెంటేటివ్ ప్రియారిటీ లిస్ట్ విడుదలైంది. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించి, అభ్యంతరాలు ఉంటే సూచించిన విధంగా తెలియజేయాలి.
AP EAPCET 2026 అడ్మిషన్లకు సంబంధించి స్పోర్ట్స్ కోటా టెంటేటివ్ ప్రియారిటీ లిస్ట్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల వివరాలను ఈ జాబితాలో పొందుపరిచారు. అభ్యర్థుల ర్యాంక్, పేరు, క్రీడా విభాగం, Individual/Team, Priority వంటి వివరాలు ఇందులో ఉన్నాయి.
అభ్యర్థులు తమ పేరు, ర్యాంక్ మరియు ఇతర వివరాలను జాబితాలో ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ జాబితా Tentative Priority List మాత్రమే కావడంతో, క్రీడా ధ్రువపత్రాల genuineness సంబంధిత Association/University ద్వారా నిర్ధారించిన తర్వాత Final Priority పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు అధికారిక AP EAPCET Admissions పోర్టల్ cap.apcfss.in ద్వారా జాబితాను పరిశీలించవచ్చు. ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే, అధికారిక నోటీసులో సూచించిన విధంగా grievance సమర్పించాలి.